రష్యా మాజి అధ్యక్షుడు బ్రెజ్నేవ్ ఒక సారి అమెరికా వెళ్ళాడు. అక్కడి పాత్రికేయులతో ఒక ప్రెస్ మీట్‍లో పాల్గొన్నాడు. ఒక పాత్రికేయుడు బ్రెజ్నేవ్‍తో, "బ్రెజ్నేవ్ గారూ! ఈ దేశములో యే పౌరుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మా దేశాధ్యక్షుడిని దూషించవచ్చు." అనాడు. ’మీ దేశములో ఇంతటి వాక్స్వాతంత్ర్యము లేదు సుమా!’ అని ఎత్తి చూపడము ఆ పాత్రికేయుడి ఉద్దేశ్యం.
ఆ ప్రశ్నకు సమాధానముగా బ్రెజ్నేవ్, "మీ ప్రశ్న మాకు అర్థమైంది. మీరనుకున్న విధమైన వాక్స్వాతంత్ర్యము మా దేశములో కూడా ఉంది. మా దేశములో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పౌరుడైనా, అమెరికా దేశాధ్యక్షుడిని నోటికి వచ్చినట్టు తిట్టవచ్చు. అందులో ఏ విధమైన ఆంక్షలు లేవు" అని ప్రత్యుత్తరమిచ్చాడు.
- కౌండిన్య తిలక్ [కుంతీ]
తెలుగు ఉపాధ్యాయులు.
No comments:
Post a Comment