భారత దేశములో ఉన్నత చదువుతున్న ప్రతి ఒక్కరు డాలర్ల వేటకై, విదేశాల గూటికి చేరాలని కలలు కంటున్నారు. అంది వచ్చిన యే చిన్న అవకాశము పక్కలైనా పట్టుకొని రెక్కలు కట్టుకొని ఎగరిపోతున్నారు. దేశాభిమానం, దేశసేవ అనే మాటలు నేటి యువత నిఘంటువులలో కనిపించని మాటలు.
కానీ, మహాత్ముతను, మహనీయులను డాలర్లు, డాబులు, పదవులు, సంపదలు ఆకర్శించలేవు.
భారత దేశమునుండి భౌతిక శాస్త్రములో తొలి నొబుల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ గారికి బెంగుళూరులోని Indian Institute of Science లో డైరెక్టర్ పదవి లభించింది. అదే సమయంలో అతడికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ఆచార్య పదవిని ఇవ్వజూపింది. కానీ దానిని అతడు త్యజించాడు. అతడి మిత్రులు "ఎందుకు ఇంతటి పదవిని, సంపదను, విదేశీ గౌరవం వదులుకున్నావు?" అని ప్రశ్నించారు.
"ఈ మాతృ భూమిలో పుట్టి, ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడి నీరు త్రాగి, ఇక్కడి వసతి సౌకర్యాలతో ఇంత స్థాయికి వచ్చాను. ఇప్పుడు నాకు తిరిగి యీ దేశానికి సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ అవకాశం వదులుకోను. నేను భారతీయుడిని. భారత్ దేశానికి సేవ చేస్తాను." అని సమాధానమిచ్చాడు.
ఇది నేటి యువతకు నాటి మహనీయుడు ఇచ్చిన దివ్య సందేశం.
- కౌండిన్య తిలక్ [కుంతీ]
తెలుగు ఉపాధ్యాయులు
No comments:
Post a Comment