Friday, January 15, 2010

రాజకీయం - విలువ

రాజకీయాల్లో ఉన్న వారికి ఆశ్రిత పక్షపాతం చూపడం, తనవాళ్లకు సిఫారసులు చేయడం కొత్త కాదు. రాజకీయాల్లో మనుగడకు అది తప్పనిసరి. అయితే ఒక ప్రక్క తస్మదీయులను మెప్పిస్తూ, మరొక ప్రక్క ఆత్మ ప్రబోధాన్ని పాటించేవారు కొందరుంటారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములో కె. వి. శంకరే గౌడ విద్యా శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఒక సారి మైసూరు విశ్వ విద్యాలయానికి ఒక కార్యక్రమానికి వెళ్ళారు. శ్రీ. దే. జవరే గౌడ అప్పటి మైసూరు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్శులు. కె. వి. శంకరే గౌడ గారు దే. జవరే గౌడ గారితో సంభాషిస్తూ, రాజకీయాల్లో భాగంగా ఎందరో నాదగ్గరకు ఎన్నో పనుల కొరకు వస్తుంటారు, పోతుంటారు. వారు యేవో సహాయాలు అడుగుతుంటారు. వారికి వెంటనే సిఫార్సు లేఖలు ఇస్తుంటాను. విశ్వ విద్యాలయాలలో యోగ్యతకు, ప్రతిభకు పురస్కారము దక్కాలి. లేని పక్షములో జ్ఞానాభివృద్ధి కుంటుపడుతుంది. కావున మీ వద్దకు అలాంటి సిఫార్సు లేఖలతో ఎవరినైనా పంపితే, వారు మిగిలిన అభ్యర్థులకన్నా, అర్హత, యోగ్యత, ప్రతిభగలవారైతే నా సిఫార్సును గౌరవించండి... లేని పక్షములో నా సిఫార్సును నిర్మొహమాటంగా చెత్తబుట్టలో వేయవచ్చు అన్నాడు.

రాజకీయాల్లో విలువలు లేని వారే ఉంటారు అని ఎందుకు అనుకోవాలి??!!

- శ్రీ. కౌండిన్య తిలక్ [కుంతీ]
తెలుగు అధ్యాపకులు

No comments: