Monday, February 2, 2009

మీరు యే కోవలోకి వస్తారు!?

తులసీ రామాయణం అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం. ఇందులో మానవ ప్రకృతి గూర్చి, చిత్త వృత్తుల గూర్చి గూడా చర్చించబడింది. అందులో ఒక చోట కవి యిలా అంటాడు. "ప్రకృతిలో మనకు కనిపించే మూడు రకాలైన ముక్కలైన గులాబి, మామిడి, పనస లలో ఒక విశెషమును చూస్తాము. గులాబిమొక్క పూలు పూస్తుంది. మామిడి మొక్క పూలతో పాటుగా పండ్లను కూడా యిస్తుంది. పనస కేవలము పండ్లను మాత్రమే యిస్తుంది. అదే విధంగా మనుషులలో కొందరు కేవలము మాట్లాడుతారు(కేవలము పూసే గులాబీల). కొందరు మాట్లాడుతారు, పనిచేస్తారు(పూసే, ఫలించే మామిడిలా). కొందరు కేవలం పనిచేస్తారు (ఫలమిచ్చే పనసలా)".

మీరు యే కోవలోకి వస్తారో మీరే నిర్ధారించుకోండి!

- క్. కౌండిన్య తిలక్.
టీ.జీ.టీ. తెలుగు.

No comments: