మన విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేయుచున్న శేషం సుప్రసన్నాచార్యకు చెలిమి సాహిత్య సాంస్కృతిక సమాఖ్య విజయవాడ వారు ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థానకవి, మహాకవి డాక్టర్ దాశరథి స్మారక పురస్కారాన్ని హైదరాబాదులోని త్యాగరాయ గానసభ మినీ ఆడిటోరియం హాలులో జులై ఇరవై ఏడవతేదీన అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాసా ప్రభావతి, ఆచార్య చేకూరి రామారావు, కళాదీక్షితులు పలువురు ప్రముఖులు హాజరై శేషం గారికి ఈ అవార్డు అందించారు. చెలిమి అధ్యక్షులు శ్రీ పి.ఎం. సుందరరావు సుప్రసన్న గారి సాహితీ సేవను కొనియాడారు. ఆచార్య చేకూరి రామారావు సుప్రసన్న కవిత్వం పద్యమైనా గద్యమైనా హృద్యంగా రమ్యంగా ఉంటుందని ప్రశంసించారు శ్రీ సుప్రసన్నకు ఇటీవలే అభినవ పోతన డాక్టర్ వానమామలై వరదాచార్య శతజయంతి పురస్కారం కూడా లభించడం ఆనందదాయకమని తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారనమని ప్రశంసించారు.. ఈ పురస్కారానికి ప్రతిస్పందిస్తూ శ్రీ సుప్రసన్న దాశరథి కవిత్వాన్ని కొనియాడుతూ దాశరథిగారి కొన్ని కవితాపంక్తులను ఉటంకించారు. ఈ పురస్కారం పొందిన సందర్భంలో విద్యాలయ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు శ్రీ సుప్రసన్నను అభినంధించారు.
No comments:
Post a Comment