Monday, October 20, 2008

మిణుగురు పూలు

రాత్రిళ్లు ఆకాశంలో
చంద్రుడు చుక్కలు
అమర వీరులకు
శ్రద్ధాంజలి ఘటిస్తున్నాయి
నిద్దరోతున్న భూమ్మీద
చీకటి దుప్పటి
కప్పింది ఆకాశం
నీకు నాకు మధ్య
కలల వంతెన వేర్చింది
రాత్రి!

పొద్దంతా అలసిన
మన దేహాల్ని కలల తోటలోకి
తీసుకెళ్తుంది మనసు!
ఏటి ఒడ్డు కూచున్నా
పాపం!
చంద్రుడు కూడా
వణుకుతున్నాడు చలికి
కదిలే నీటి అలలవై!

- ప్రశాంతి.
ఏడవ తరగతి

No comments: