Monday, September 22, 2008

గురువు

తనదు జ్ఞానస్తన్య క్షీర ధార గుడిసి,
చటువువిద్యా క్షుధనుదీర్చు జనని గురువు!
క్షీర, నీర భేదములను కూరిమి తోడ
అరయచెప్పునట్టి పరమహంస గురువు!

తనదు జ్ఞాన సంపదలను తనివితీర
దానమొనర్చు అనుపమ త్యాగియతడు!
శిశువులకు భావి దర్శింపజేసి, ప్రగతి
మార్గమునుపదేశించెడు యోగియతడు!

ధర్మరక్షణ యందు, కర్మ పాలన యందు
కీర్తి గడించిన ’కృష్ణుడ’తడు!
ప్రాణదానమొకటె, ప్రజలకు హితమని
శిలువనెక్కిన ఘన ’జీసస’తడు!
దాయార్ద్ర హృదయమంబె ధరణిలో గుణమని
తెలియజేసిన ’రంతిదేవుడ’తడు!
సత్యనిష్ఠయొకటే శాశ్వతమగునని
చాటి చెప్పిన ’హరిశ్చంద్రుడ’తడు!

కృద్ద హింస కూడదనిన ’బుద్దుడ’తడు!
మహిన ధీరుడేనిలువను ’మహ్మద’తడు!
ఎవరు యెవరీ ఘనాఘన ఈశ్వరుండు?
మజ్జిగములకు వెలుగైన ఒజ్జి యతడు!

- కుంతి
[కె. కౌండిన్య తిలక్. టి.జి.టి. తెలుగు]

No comments: