Monday, September 22, 2008

అమ్మా!

నీ జన్మంతా నన్నే లక్శ్యంగా భావించావు!
నా లక్శ్యము చేరే వరకు నీవు శ్రమించావు!
నా యిష్టాన్ని నీ యిష్టంగా మార్చుకున్నావు!
నా కష్టాన్ని నీ కష్టంగా చేసుకున్నావు!
ఎంత ప్రేమో, ఎంత కరుణో నీకు!
ఎన్ని జన్మల వరమో నీవు నాకు!
ఎలా చెల్లించుకోను ఋణము నీకు?
తల్లినై పుడుతాను మరు జన్మకు!

- సీ. ఆంజనేయులు
పదవ తరగతి

No comments: