Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Friday, January 15, 2010

మరో స్వర్గం

అందమైన ఈ మరో స్వర్గం
కోకిలమ్మ స్వర మాధుర్యం
ఆకర్షించే నెమలి నాట్యాలు
చిలకల తియ్యని పలుకులు
పెయ్యల మువ్వల గలగలలు
సప్త స్వరాల సరాగాలు
ఆ కొత్త చిగురాకుల సవ్వడులు
స్వర్గాన్ని తలపించే ఆ జలపాతాలు
నృత్యమాడే ఆ రంగురంగుల పువ్వులు
పరుపులా పరచబడినట్టుండే ఆ నీలి గగనం
ఆ పరుపువై స్వేచ్ఛగా ఎగిరే ఆ పక్షులు
భూమి పై పరుగులు తీసే లేడి
అమాయకంగా నవ్వే పసిపిల్లలు
ఆహ్లాదమైన పచ్చని పంట పైర్లు
మనసును తాకే ఆ చిరుగాలి
చూస్తున్నావుగా నేస్తమా!
ఎంత చక్కనైనదీ ఈ లోకం.
- ప్రణుతి. 7 అ విభాగం.

యేసూ!

మమతను మతముగా తెలుపగ!
క్రమతను, నడతను వ్రతముగ
నడుపగ ! శాపా
ర్తి మనస్కులకావన్ ! యే
సూ! మర లారమ్మూమాకు
సుగతిని బ్రోవన్ !

- శ్రీ కౌండిన్య తిలక్ [కుంతీ]
తెలుగు అధ్యాపకులు

మనసు వికసిస్తే

పువ్వు వికసిస్తే పరిమళం వెదజల్లుతుంది
సూర్యుడు వికసిస్తే వెలుగు వెదజల్లుతుంది
ప్రకృతి వికసిస్తే పచ్చదనం వెదజల్లుతుంది
మనసు వికసిస్తే ఆనందం వెదజల్లుతుంది
విద్యార్థి వికసిస్తే విద్య వెదజల్లుతుంది.

- ఎస్. గాయత్రి. 6 తరగతి.

మధురం

కోకిల పాడే పాట మధురం
గలగల పారే సెలెయేరు మధురం
అమ్మ పాడే జోల పాట మధురం
పువ్వుకు మకరందం మధురం
మన చదువుకు నవోదయ మధురం.

- ఇ. మౌనిక. 9 అ విభాగం

Monday, May 4, 2009

ఉగాది [పద్య కవిత]

ప్రాగారమ్ములు కళగా
రాగమతిశయించి ప్రేమ రాగము నింవెన్
వేగముగా ఏతెంచుము
స్వాగతమో నవ ఉగాది! శాంతవిహారీ!

ప్రకృతి కోయిల తీయగా పాడు చుండ
చిగురు మావిళ్ళు లేలేత సిగ్గునొంద
వేము కష్ట సుఖాలతో వింది చేయ
వేగ రావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

మానవత్వమ్ము నశియించి దానవత్వ
మావరించెను మంచి సమాధి చెందె
శాంతి గీతాలు గుండెలో క్రాంతి నింప
కోకిలా తీయగాపాడు కొసరి కొసరి!

సమర సన్నాహ వేదిక శంఖమూద
ఆకసమ్మున బాంబులు ఆటలాడ
సకల జనుల బాధలుదీర్చ జాగులేక
వేగరావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

పెళ్ళి సందడి నిండుగా వెలయునట్లు
అలర బ్రహ్మోత్సవములెల్ల అమరునట్లు
పంచభూతాల దూతవై పరుగు తోడ
వేగరావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

- శేషం సుప్రసన్నాచార్యులు
[తెలుగు ఉపాధ్యాయుడు]

ఉగాది మధువు చిలికింది

కోరికతో
మామిడమ్మ
కొత్త రెమ్మ తొడిగింది

కొమ్మలతో
రెమ్మలతో
పూత వెల్లివిరిసింది

కోకోయని
కోయిలమ్మ
కొత్త పాట పాడింది

షడ్రుచులు
చేతబట్టి
ఉగాది లక్ష్మి వచ్చింది

కొత్త ఆశ
తాయిలాలు
తాను వెంట తెచ్చింది

ఆనందం
ఎగిసింది
నేల నింగి కలిసింది

పల్లె పులకరించింది
ఉగాది మధువు చిలికింది.

- ఎస్. సుహాసిని. 8 - A [2009-10]

స్నేహం

స్నేహం ఒక అమృత గీతి!
స్నేహం ఒక అనల్పానుభూతి!
స్నేహం తీయని అనుభూతి!
స్నేహం మాయని దివ్య జ్యోతి!
మనుష్య కోటికి స్నేహ రీతి!
కలుగ జేయును ఎంతో ప్రగతి!
పవిత్ర స్నేహానికి లేదు మృతి!
నెయ్య మందున మురియు జగతి!

- కె. శ్రీలక్ష్మి. 8 - B [2008-09]

స్నేహ బంధం

తరతరాలకు విడిపోని బంధం
కాలం కలిపిన బంధం
అంతేలేని బంధం
ఒకరికి ఒకరు తోడుగ ఉండే బంధం
అదే స్నేహ బంధం.

- కె. శ్రావ్య. 8 - B. [2009-10]

దేవుడు

ఆకాశమనే దేవుడు
జ్ఞాన వర్షాన్ని
హర్షంగా నలు దిక్కులూ
వర్షిస్తున్నాడు!
తెలివితేటలు అనే సస్యరమను
పండించడానికి!
మనుషుల
సమస్యలు అనే ఆకలిని
తీర్చడానికి!

- బీ. రజిత. 12 Science. [2009-10]

కలిసి ఉంటేనే ప్రగతి

మనిషి మనిషి కలిస్తే ఐక్యత
మనసు మనసు కలిస్తే మమత
మతం మతం కలిస్తే మానవత
కులం కులం కలిస్తే సమత
యువత యువత కలిస్తే నవత
కలిసి నడుద్దాం
ప్రగతిని సాధిద్దాం !

- పి. రోహిత్ కుమార్ రెడ్డి. 8 th A [2009-10]

జీవితం !

భీరువుకు
జీవితం సమస్యల సుడిగుండం!
సాహసికి
జీవితం ఆణిముత్యాలు దొరికే సాగరం!

- ఎమ్. జ్యోతి. పదవ తరగతి [2009-10]

Monday, February 2, 2009

నీ స్నేహం

చంద్రునిలోని చల్లదనం
సూర్యునిలోని వెచ్చదనము
కలగలసిన అనుభూతి నీ స్నేహం!
వసంత ఆగమనము
అనంత శుభ సందేశము
కలిపి తెచ్చిన బహుమతి నీ స్నేహం!

- స్వాతి. ఎస్. తొమ్మిదవ తరగతి